T20 World Cup 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:47 AM
టీ20 వరల్డ్ కప్ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ (ICC Mens T20 World Cup) ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్(England) మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న కమిన్స్, అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో మాత్రమే ఆడాడు. అతడికి జనవరి చివరి వారంలో స్కాన్ నిర్వహించనున్నారు. దాని ఫలితం ఆధారంగా ప్రపంచ కప్ ఆడే తుది జట్టులో అతడు భాగమవుతాడో.. లేదా తెలుస్తుంది. ఇదే సమయంలో సెలక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ పలు కీలక విషయాలను వెల్లడించాడు. గాయాల నుంచి కమిన్స్, హేజిల్‌వుడ్, డేవిడ్‌లు కోలుకుంటున్నారని తెలిపాడు. ఈ ముగ్గురూ టోర్నమెంట్ సమయానికి ఫిట్‌గా ఉంటారని అతడు విశ్వాసం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లో డేవిడ్ గ్రేడ్ టూ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన సంగతి తెలిసిందే. అలాగే హేజిల్‌వుడ్ హామ్‌స్ట్రింగ్ గాయం తర్వాత చీలమండల నొప్పితో యాషెస్ సిరీస్ 2025-26కు దూరమయ్యాడు.
టీ20 వరల్డ్ కప్-2026 ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానెల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ఇవీ చదవండి:
Chris Lynn: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!