Share News

Australia Women Cricketers: మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు!

ABN , Publish Date - Oct 25 , 2025 | 02:46 PM

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా..కొందరి బుద్ధి మారడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఆడవాళ్ళు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ సారి ఏకంగా మహిళా క్రికెటర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

Australia Women Cricketers: మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు!
Australian women cricketers

క్రికెట్ న్యూస్: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా..కొందరు బుద్ధి మారడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఆడవాళ్ళు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. పలువురు మహిళా సెలబ్రిటీలు సైతం తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా మహిళా క్రికెటర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.


మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం ఆస్ట్రేలియా జట్టు(Australia women cricketers) భారత్‌లో పర్యటిస్తోంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కోసం ఇండోర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వేదికగా నేడు(శనివారం) దక్షిణాఫ్రికాతో ఆసీస్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈక్రమంలోనే ఆసీస్‌కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు(women cricketers harassment) గురిచేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


హోటల్ గది నుంచి కెఫేకు తమ ప్లేయర్లు నడిచి వెళ్తుండగా నిందితుడు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆసీస్ టీమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంతో పాటు వారిద్దరి((Australia women cricketers)) పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిపాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడు అకీల్‌ను అందుపులోకి తీసుకున్నారు. ఇండోర్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆసీస్ ప్లేయర్లు ఉంటున్నారు. గత గురువారం ఆసీస్ మహిళా ప్లేయర్లకు(women cricketers harassment) వేధింపులు ఎదురవ్వా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2025 | 02:46 PM