MLA Palle Sindhura Reddy: మరో 20 రోజుల్లో సుందర పుట్టపర్తి..
ABN , Publish Date - Oct 25 , 2025 | 02:01 PM
సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
- ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి
పుట్టపర్తి(అనంతపురం): సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి(MLA Palle Sindhura Reddy) ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పడమటిగేట్ రోడ్డు అభివృద్ధికి రూ.1.4 కోట్లు, వీధిలైట్లు రూ. 20లక్షలు, డ్రైనేజీ రిపేరీ, శానిటేషన్‌కు రూ.70లక్షలు, డీఎంఎఫ్, మునిసిపాలిటీ స్పెషల్‌గ్రాంట్ నిధుల ద్వారా మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు మరో రూ 1.5కోట్ల వ్యయం చేస్తున్నామన్నారు.

శానిటేషన్ మరమ్మతు పనులు కోసం ఆదనంగా 20 మంది కార్మికులను నియమించినట్లు తెలిపారు. పట్టణంలో బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ.4కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సహకారంతో సీసీకెమెరాలు, డ్రోన్లు ఇతరత్ర భద్రతా ఏర్పాట్ల కోసం రూ.1.16 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎ్‌సఆర్ నిధులతో జోయలుకాస్ సంస్థ చిల్డ్రన్‌పార్క్ అభివృద్ధి పనులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News