Share News

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు

ABN , Publish Date - Oct 25 , 2025 | 02:01 PM

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయంగా మారింది.

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు
Hyderabad Rain

హైదరాబాద్, అక్టోబర్ 25: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన (Hyderabad Rains) దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది.


అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలిచౌకిలోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్‌లో కూడా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (శుక్రవారం) కూడా హైదరాబాద్‌లో ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకండానే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికిల్స్ నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఇవి కూడా చదవండి..

కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 03:09 PM