Share News

Kurnool Fire Accident: కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

ABN , Publish Date - Oct 25 , 2025 | 06:55 AM

చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీ కొట్టి అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని, ఇవి ఒక్కసారిగా పేలడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి.

Kurnool Fire Accident: కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
Kurnool Fire Accident

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: కర్నూలు అగ్ని ప్రమాద ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఫోరెన్సిన్ బృందాలు క్లూస్ ఆధారంగా అనేక కోణాల్లో ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పరిశిలిస్తున్నారు. చిన్నటేకూరు సమీపంలో బైక్ ఢీ కొట్టి అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని, ఇవి ఒక్కసారిగా పేలడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి. ‘మొదటగా బైక్ ను బస్సు ఢీ కొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి అందులోని పెట్రోల్‌ కారడం మొదలైంది. క్షణాల్లోనే బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది.


ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందాలు.. కీలక ఆధారాలు గుర్తించాయి. ' వాహనాల మధ్య రాపిడి తలెత్తడంతో నిప్పురవ్వలు చెలరేగి, పోట్రోల్ కు అగ్ని అంటుకొని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ మంటలు తొలుత లగేజి క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉంది. చిన్నగా మొదలైన మంటలు బ్యాటరీకి కూడా అంటుకోవడంతో ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. క్షణాల్లోనే వ్యాపించిన మంటలు.. లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారు మంటల్లో సజీవ దహనం అయ్యారు.' అని అధికారులు వివరించారు.


ఇవి కూడా చదవండి:

Child Abuse Case: మా కుటుంబాన్ని వైసీపీ నేతలు ట్రోల్‌ చేశారు

Education Department: టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Updated Date - Oct 25 , 2025 | 08:34 AM