Share News

Nagula Chavithi 2025: నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:32 AM

నాగుల చవితి సందర్భంగా  ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. స్వామివారిని దర్శించేందుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు రావచ్చు అని అంచనా వేస్తున్నారు.

Nagula Chavithi 2025: నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Nagula Chavithi 2025

కృష్ణా జిల్లా, అక్టోబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి (Nagula Chavithi 2025) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీస్వామివారి నాగుల చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు  స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్.. పుట్టలో పాలు పోసి.. ఆపై కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.


నాగుల చవితి సందర్భంగా  ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు స్వామి దర్శనార్ధం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద రావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.


ఇవి కూడా చదవండి..

నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం

కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 09:43 AM