Home » Mandali Buddha Prasad
నాగుల చవితి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. స్వామివారిని దర్శించేందుకు సుమారు 50 వేలకు పైగా భక్తులు రావచ్చు అని అంచనా వేస్తున్నారు.
Andhrapradesh: భుజాన తుపాకి పెట్టి తెలుగు భాషను చంపాలని చూస్తున్నారని మండలి బుద్ధ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, తెలుగు రాష్ట్రం లేకుండా చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అన్నట్లుగా తెలుగు భాష పరిస్థితి ఉందన్నారు. పాలకులు కూడా తెలుగు భాష వైభవం గురించి బాధ్యత తీసుకోవాలని కోరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లు సాధించింది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి.. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయ్యాలి.... అదీ కూడా టోటల్‌గా వారిని కన్ప్యూజ్ చేసి పారేయాలి. అలా అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. అదీకూడా ప్రజాస్వామ్య బద్దంగా.. అధికారన్ని అందుకోగలం.
Andhrapradesh: మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుద్ధప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు.