Share News

AP Elections: జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్.. అవనిగడ్డ టిక్కెట్ ఆయనకేనా?

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:57 PM

Andhrapradesh: మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుద్ధప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు.

AP Elections: జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్.. అవనిగడ్డ టిక్కెట్ ఆయనకేనా?

కాకినాడ, ఏప్రిల్ 1: మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ (Former Deputy Speaker Mandali Buddhaprasad) జనసేనలో (Janasena) చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సమక్షంలో బుద్ధప్రసాద్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుద్ధప్రసాద్‌కు పవన్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మాట్లాడుతూ.. అవనిగడ్డలో తనను నిలబడాలని పవన్ కోరారని తెలిపారు. చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇచ్చారన్నారు. తనకు టికెట్ ఖాయం అయిందని.. ఈరోజు అధికారికంగా తన పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. ఐదేళ్లుగా ఏపీలో జరగని అరాచకం లేదని అన్నారు. వేలకోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. తెలుగు భాష అభివృద్ధికు తాము చేసిన కృషిని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని తెలిపారు.

Stock Market: తొలి రోజున దేశీయ సూచీల్లో బుల్ జోరు.. ఆల్ టైమ్ హైను తాకిన సెన్సెక్స్!

అందుకే టీడీపీకి గుడ్‌బై...

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections) టీడీపీ తరఫున అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మండలి బుద్ధప్రసాద్ భావించారు. అయితే టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించడం జరిగింది. దీంతో మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీకి గుడ్‌బై చెప్పేసి జనసేన పార్టీలో చేరారు. ఏపీలో టీడీపీ - బీజేపీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 19 అసెంబ్లీ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఇక మిగిలింది అవనిగడ్డ, పాలకొండ స్థానాలు.

Air Force One: అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‍‌ఫోర్స్ వన్’లో వరుస చోరీలు.. తెరవెనుక ఎవరో తెలిస్తే షాకే!


అవనిగడ్డలో హీటెక్కిన రాజకీయం...

మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్ కోసం జనసేన నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఎవరో ఒకరికి సీటు ఖాయమని జనసేన శ్రేణులు భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా మండలి బుద్ధప్రసాద్ పేరు తెరపైకి రావడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవనిగడ్డలో రాజకీయం వేడెక్కింది. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడంపై జనసైనికులు భగ్గుమంటున్నారు. అవనిగడ్డలో తన ఇంటి వద్ద మీటింగ్ పెట్టించి జనసేన ఓడిపోతుందని మాట్లాడించిన బుద్ధప్రసాద్‌ను పార్టీలో ఎలా చేర్చుకొని సీటు ఇస్తానని ప్రశ్నిస్తున్నారు. బుద్ధప్రసాద్‌కు జనసేన పార్టీ సీటు ఇస్తే రాజీనామా చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. ఎవరినీ సంప్రదించకుండా బుద్ధప్రసాద్ పేరు ఎలా సూచించారంటు జిల్లా పార్టీ అధ్యక్షుని పైకి జనసైనికులు దూసుకువెళ్లిన పరిస్థితి. సవాళ్లు ప్రతీ సవాళ్లతో జనసేన కార్యాలయం రసభాసాగా మారింది. బుద్ధప్రసాద్‌కు కాకుండా ఎవరిని నిలబెట్టినా తాము కలసి కట్టుగా ఉంటామని జనసేన ముఖ్య నేతలు తీర్మానించారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ టిక్కెట్ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉండబోతుందని చూడాలి.

ఇవి కూడా చదవండి..

AP Elections : టీడీపీలోకి జంగా.. ముహూర్తం ఖరారు!

X Click here: ఎక్స్‌లో క్లిక్ హియర్ ట్రెండ్.. అసలేంటిది.. దీంట్లో మనమూ భాగస్వామ్యం కావొచ్చా


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2024 | 05:05 PM