Home » Avanigadda
ఏపీలో జరుగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మొంథా తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ప్రజలకు ఎలర్ట్ మెసేజ్‌లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారని కొనియాడారు.
తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్‌పై దాడి చేశారు. సురేశ్‌పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు.
కృష్ణానదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన వారంతా ముగిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ శ్రీహరి రావు హత్య కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 2021 నవంబర్ 27న డాక్టర్ శ్రీహరి రావును దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీహరి రావు నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వ్యాపార భాగస్వామి కావడంతో హత్య సంచలనంగా మారింది.
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అవనిగడ్డ, (కృష్ణాజిల్లా): అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్.. రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాల జోరును పెంచాయి. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అధికార పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు.
అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని అన్నదానం హాలు సీలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. నాణ్యత ప్రమాణాల లోపం కారణంగానే సీలింగ్ కూలిందని భక్తులు, స్థానికులు అంటున్నారు. నాలుగు నెలల క్రితమే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అట్టహాసంగా అన్నదానం హాలుని ప్రారంభించారు.