Share News

Cordon Search.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో కార్దన్ సెర్చ్

ABN , Publish Date - May 21 , 2024 | 09:48 AM

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Cordon Search.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో  కార్దన్ సెర్చ్

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు (Police) మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ (Cordon Search Operation) నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్ (Rowdy sheeters), సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సీఐ త్రినాధ్ నేతృత్వంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఎస్ఐ రమేష్, కోడూరు, నాగాయలంక సిబ్బంది పాల్గొన్నారు.


అలాగే ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.), నందిగామ డీవీఆర్ కాలనీలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీ రవికిరణ్ స్రవంతి రాయలు సిబ్బందితో కలిసి కాలనీలో 500 ఇళ్ళు తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగానే లేని 22 ఆటోలు, 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!

సన్నాలకు బోనస్‌..

ఎవరికి ఎన్ని సీట్లో?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 09:54 AM