YSRCP Leaders Attack TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:32 PM
వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్‌పై దాడి చేశారు. సురేశ్‌పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు.
కృష్ణా,అవనిగడ్డ, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు (YSRCP Leaders) మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్త ఎలమంచిలి సురేశ్‌పై దాడి చేశారు. సురేశ్‌పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు. వైసీపీ నేతల దాడిలో గాయాలపాలైన సురేశ్‌ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సురేశ్‌కు వైద్యం అందిస్తున్నారు వైద్యులు.
సురేశ్‌పై దాడికి నిరసనగా బొబ్బర్లంక వద్ద ఆయన బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బంధువుల ధర్నాకు అవనిగడ్డ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వేంకటేశ్వరరావు, జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జున రావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వర్ రావు మద్దతు ఇచ్చారు . ఈ దాడికి సంబంధించి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ధర్నా చేస్తున్న వారిని సముదాయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నా విరమింపచేశారు కృష్ణా జిల్లా పోలీసులు. ఎలమంచిలి సురేశ్‌పై అకారణంగా దాడి చేశారని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ నేతలు ఇలాంటి చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు, టీడీపీ నేతలు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..
Read Latest Andhra Pradesh News and National News