AP News: వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:16 AM
రాయదుర్గంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు.
- బీజేపీలోకి వైసీపీ కౌన్సిలర్ల చేరిక..
అనంతపురం: రాయదుర్గం(Rayadurgam)లో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు బీజేపీ(BJP)లో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ(Vijayawada)లో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వారికి కండువా వేసి ఆహ్వానించారు.

రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస యాదవ్, కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, షబ్బీర్, ఏటూరి రమేష్, డిష్ గోవిందరాజులు, వన్నూరప్ప, ఎంపీపీ సలహాదారుడు డబ్బతి నాగిరెడ్డి, సీనియర్ నాయకులు రవీంద్రారెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కుమార్‌రెడ్డి, గొల్ల రామాంజినేయులు, బాబు బీజేపీలో చేరినవారిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీ నాయకులు బీజేపీలో చేరారని మాధవ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News