Rajampet MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:19 PM
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు 5 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు 5 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈరోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మిథున్ రెడ్డి విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, ఎంపీ మిథున్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్‌పై ఎనిమిదో తేదీన విచారణ జరగనుంది.
జైలులో రాజభోగాలు..
ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో సకల మర్యాదలూ జరుగుతున్నాయి. ఆయన ఉండే జైలు గదిలో 8 ఫ్యాన్లు, జైలుకు వచ్చిన మూడో రోజు నుంచే కూలర్, మినరల్ వాటర్, మంచం, టేబుల్, కుర్చీలు, దుప్పట్లు మార్చడానికి.. గది శుభ్రం చేయడానికి ఖైదీలు, దోమలు రాకుండా కిటికీలకు దోమ తెరలు సైతం ఏర్పాటు చేయబడ్డాయి. కోర్టు ఆదేశాలకు మించి అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారంలో ఆదివారం తప్ప మిగతా ఆరు రోజులు కుటుంబీకులు, స్నేహితులు, న్యాయవాదులను మిథున్ రెడ్డి కలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వామ్మో.. పులికి ఆకలేస్తే ఇలాగే ఉంటుంది.. పులికి చిక్కిన లేడి పరిస్థితి చూడండి..