Share News

Tiger hunts deer: వామ్మో.. పులికి ఆకలేస్తే ఇలాగే ఉంటుంది.. పులికి చిక్కిన లేడి పరిస్థితి చూడండి..

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:18 PM

అడవిలోని క్రూరమృగాలకు ఆకలేస్తే ఏదో ఒక జంతువుకు ఆయువు మూడినట్టే. అడవికి రారాజు సింహం అయినా వేటాడడంలో మాత్రం పులికి సాటి రాదు. పులి ఏం జంతువు మీదైనా కన్నేస్తే దాని ప్రాణం పోవాల్సిందే అనేంత రీతిలో పోరాడుతుంది.

Tiger hunts deer: వామ్మో.. పులికి ఆకలేస్తే ఇలాగే ఉంటుంది.. పులికి చిక్కిన లేడి పరిస్థితి చూడండి..
tiger hunts deer

అడవిలోని క్రూరమృగాలకు ఆకలేస్తే ఏదో ఒక జంతువుకు ఆయువు మూడినట్టే. అడవికి రారాజు సింహం అయినా వేటాడడంలో మాత్రం పులికి సాటి రాదు (wildlife encounter). పులి ఏం జంతువు మీదైనా కన్నేస్తే దాని ప్రాణం పోవాల్సిందే అనేంత రీతిలో పోరాడుతుంది. పులి వేట నైపుణ్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి (Rare tiger video). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.


travel.kannadiga అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Tiger hunting video) షేర్ అయింది. ఆ వీడియోను కర్ణాటకలోని నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో కొన్న జింకలు గుంపులుగా ఉన్నాయి. అక్కడకు పులి వస్తున్నట్టు గ్రహించిన జింకలు అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. అయితే అకస్మాత్తుగా దాడి చేసిన పులి ఓ జింకను పట్టుకుంది. భారీ జంకను పట్టుకుని దాని మెడ కొరికి చంపేసింది. జింక తప్పించుకోవడానికి పోరాడినప్పటికీ ప్రయత్నం లేకపోయింది.


ఆ ఘటనను కొందరు టూరిస్ట్‌లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు (Tiger deer chase). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా వీక్షించారు. 37 వేల మందికి పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేశారు. వావ్.. పులి వేటను ఇలా వీడియో తీయగలగడం అద్భుతం అని ఒకరు కామెంట్ చేశారు. సింహం బలం ముందు ఏ జంతువూ నిలువలేదని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..


మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2025 | 12:18 PM