Clever jugaad: ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:54 AM
ఇటీవలి కాలంలో బైక్ దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయి. రోడ్డు పక్కన, ఇంటి బయట పార్క్ చేసిన బైక్‌లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ చేసినా కూడా సులభంగా ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ దొంగతనాలను నివారించడానికి ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్‌ను వెల్లడించాడు.
ఇటీవలి కాలంలో బైక్ దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయి. రోడ్డు పక్కన, ఇంటి బయట పార్క్ చేసిన బైక్‌లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ చేసినా కూడా సులభంగా ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ దొంగతనాలను నివారించడానికి ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్‌ను వెల్లడించాడు (Bike security jugaad). ఆ వైరల్ జుగాడ్ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఒక్క రోజులోనే 60 లక్షల మందికి పైగా వీక్షించారు (Bike theft prevention).
pakamatbro అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (viral video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్ దొంగతనాన్ని నివారించడానికి ఓ సీక్రెట్ ట్రిక్ చెప్పాడు. ముందుగా బైక్ హ్యాండిల్‌ను, బ్రేక్‌ను కలుపుతూ ఓ గుండ్రటి రింగ్ పెట్టాడు. ఆ తర్వాత ఆ రింగ్‌కు, బ్రేక్‌కు కలిపి తాళం కప్ప వేశాడు. దీంతో ఎవరైనా బైక్ స్టార్ట్ చేసినా, దానిని తీసుకెళ్లడం సాధ్యం కాదు. స్టార్ట్ చేసినపుడు పెద్ద శబ్దం వస్తుంది. ముందుకు కదలదు. ఈ ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ వీడియోలో వివరించారు (anti-theft trick).
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 65 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 1.71 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అతడి తెలివికి సలాం చెప్పాల్సిందేనని ఒకరు ప్రశంసించారు. ఈ ట్రిక్ వల్ల అంత పెద్ద ఉపయోగం ఉండదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలోని ఉడతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..