Camel Attack: వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:48 PM
సాధారణంగా ఒంటెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటుంది. అయితే ఒంటెకు కూడా కోపం వస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది.
సాధారణంగా ఒంటెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటాయి. అయితే ఒంటెకు కూడా కోపం వస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియోలో కొందరు కుర్రాళ్లను ఒంటె పరిగెత్తించింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. krishnansh_arora అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (boys teasing camel).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒంటె చెట్ల దగ్గర నిల్చుని ఆకులు తింటోంది. పక్కనే కొందరు కుర్రాళ్లు ఉన్నారు. ఓ కుర్రాడు ఆకులు ఉన్న కొమ్మతో ఆ ఒంటెను టీజ్ చేశాడు. దీంతో ఆ ఒంటె తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆ కుర్రాడి పై దాడి చేయడానికి పరిగెత్తింది. దీంతో కుర్రాళ్లు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వారిని ఆ ఒంటె వెంబడించింది. అయితే ఆ యువకులు ఆ ఒంటెకు దొరకకుండా పారిపోయారు (camel chases boys).
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారంది (viral animal footage). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 4.9 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. వామ్మో.. ఒంటెకు కూడా ఇంత కోపం వస్తుందా అని ఒకరు కామెంట్ చేశారు. వారిలో ఎవరైనా ఒంటెకు దొరికి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..