Share News

X Click here: ఎక్స్‌లో క్లిక్ హియర్ ట్రెండ్.. అసలేంటిది.. దీంట్లో మనమూ భాగస్వామ్యం కావొచ్చా

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:40 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(Click Here) అనే ట్రెండ్‌ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.

X Click here: ఎక్స్‌లో క్లిక్ హియర్ ట్రెండ్.. అసలేంటిది.. దీంట్లో మనమూ భాగస్వామ్యం కావొచ్చా

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(X Click Here) అనే ట్రెండ్‌ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.

‘సి’ అక్షరం నుంచి ఎడమ వైపు ఒక బాణం గుర్తు ఉండి, దాని చివరన కింద చిన్న అక్షరాలతో ఇంగ్లిష్‌లో ‘ఆల్ట్’ అని రాసి ఉంటుంది. ఈ ఆల్ట్ బటన్‌పై క్లిక్ చేయగానే ఒక మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ ఆల్ట్‌ను(ALT)క్లిక్ చేయకపోతే కేవలం క్లిక్ హియర్ అనే పదాలను మాత్రమే చూడగలుగుతారు. అందులో దాగి ఉన్న మెసేజ్‌ని చూడలేరు. ఈ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి రాజకీయ పార్టీలు, పార్టీల నేతలు, సినీ సెలబ్రెటీలు ఇందులో భాగమవుతున్నారు.

అసలేంటిది..

ఆల్ట్ టెక్ట్స్ అనేది ఒక టెక్ట్స్ ఫీచర్. ఎక్స్ చాలా కాలం క్రితమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఎవరైనా ఫొటోను షేర్ చేసేటప్పుడు దాని గురించి ఏదైనా రాయొచ్చు. ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ రూపంలో ఏదైనా ఒక ఫొటో గురించి వెయ్యి అక్షరాల వరకు మెసేజ్‌ను పొందుపరచవచ్చు. దీని వల్ల ఎక్స్‌లో కంటెంట్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇలా వాడండి..

ఇందులో మనమూ సందేశాలు పంపవచ్చు. ఎక్స్‌లో ఈ ఫీచర్‌ను ఫోటోలకు ఉపయోగించవచ్చు. కానీ, వీడియోలతో ఈ ఫీచర్‌ను వాడలేం. ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసినప్పుడు, ఫోటోతో పాటు +ALT అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ఆల్ట్‌ను క్లిక్ చేసి ఏదైనా మెసేజ్ టైప్ చేసి దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు రాసిన మెసేజ్‌ ఫోటోతో కలిసి పోతుంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత ఆల్ట్ మీద క్లిక్ చేస్తే అందులోని మెసేజ్ కనిపిస్తుంది.


ప్రముఖులు ఏమన్నారంటే

  • శివసేన, ఆప్, బీజేపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు 'ఇక్కడ క్లిక్ చేయండి'(Click Here) ట్రెండ్‌పై ఆందోళన వ్యక్తం చేశాయి.

  • ఎక్స్‌లో తన టైమ్‌లైన్ అంతా ‘క్లిక్ హియర్’ ఫోటోలతో నిండిపోయిందని, అసలు ఏంటిది అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.

  • అలాగే కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ ఈ ట్రెండ్‌లో పాల్గొంటూ ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్‌లో సుదీర్ఘ సందేశాన్ని రాసింది.

  • బీజేపీ "ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్" అనే నినాదంతో ప్రతిస్పందిస్తూ.. ఈ ట్రెండ్‌ని రాజకీయాలకు ముడిపెట్టింది.

  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇండియా కూటమి మహా ర్యాలీ ప్రచారానికి ట్రెండ్‌ని ఉపయోగించుకుంది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఈ సమావేశానికి హాజరు కావాలని కోరింది.

  • సినీ నటులు కూడా ఎలాంటి హ్యాష్‌ట్యాగ్ లేకుండా.. ఈ ట్రెండ్ గురించి తెలుసుకునేందుకు పోస్ట్‌లు చేస్తున్నారు.

  • ఏప్రిల్‌లో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యాయి.

  • ‘‘2024 జగనన్న వన్స్‌ మోర్’’ అంటూ వైసీపీ రాసుకొచ్చింది. ‘‘2024 వైసీపీ నో మోర్’’ అని టీడీపీ రాసింది.

  • అకస్మాత్తుగా క్లిక్ హియర్ ఫీచర్ ట్రెండ్ అవుతున్నందునా వినియోగదారులు అయోమయానికి గురయ్యారు.

Updated Date - Apr 01 , 2024 | 04:47 PM