Share News

AP Elections : టీడీపీలోకి జంగా.. ముహూర్తం ఖరారు!

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:58 PM

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చెసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు.

AP Elections : టీడీపీలోకి జంగా.. ముహూర్తం ఖరారు!

మాచర్ల, ఏప్రిల్1: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ లేకుంటే 6వ తేదీ.. పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొనున్నారు. ఆయన సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వర్గమంతా ముకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసింది. వారు కూడా నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

అయితే గురజాల ఎమ్మెల్యే వైసీపీ టికెట్‌ను జంగా కృష్ణమూర్తి ఆశించారు. కానీ మరొకరికి ఆ టికెట్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేటాయించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇంకో వైపు బీసీ నేతగా మంచి పేరున్న జంగా కృష్ణమూర్తి.. నరసారావుపేట నుంచి ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారనే ఓ ప్రచారం సైతం ఇటీవల వరకు సాగింది. కానీ ఆ టికెట్ సైతం మరొకరికి ఇచ్చేశారు. అటు ఎంపిీ, ఇటు ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించక పోవడంతో జగన్ పార్టీకి జంగా బై బై చెప్పినట్లు సమాచారం.

ఇటీవల టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి బీసీ నేత జంగా కృష్ణమూర్తికి కట్టబెడతారంటూ ఓ ప్రచారం అయితే గట్టినే నడిచింది. కానీ ఆ పదవిలో వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే నియమించారు. దాంతో జంగాతోపాటు ఆయన వర్గం సైతం తీవ్ర అసంతృప్తికి గురైందని తెలుస్తోంది. జంగా.. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇది ఒక ముఖ్య కారణమని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది.

ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ గెలుపులో ఇదే జంగా కృష్ణమూర్తి అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాదించింది. దీంతో కేసీఆర్ కేబినెట్‌లోని బీసీ మంత్రులను గురజాల వేదిక జంగా కృష్ణమూర్తి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఘనంగా సన్మానించారు. తద్వారా ఆ మరుసటి ఏడాది అంటే 2019లో జరిగిన ఏఫీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపునకు.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఈ కార్యక్రమం గొప్పగా దోహదపడిందనే ఓ చర్చ అయితే నేటికి పోలిటికల్ సర్కిల్‌లో వాడివేడిగా వైరల్ అవుతోంది.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

TDP-Janasena: హమ్మయ్యా.. అలక తీరింది.. అక్కడ టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి..

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

Updated Date - Apr 01 , 2024 | 04:08 PM