Share News

TDP-Janasena: హమ్మయ్యా.. అలక తీరింది.. అక్కడ టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి..

ABN , Publish Date - Apr 01 , 2024 | 12:25 PM

హమ్మయ్యా.. అలక తీరింది.. వివాదం సమసిపోయింది. ఇన్ని రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు నేడు ఏకమయ్యారు. తిరుపతి టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మతో ఆమె నివాసంలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు భేటీ అయ్యారు. దీంతో వివాదం సమసినట్టైంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశంతో భేటీకి ప్రాధాన్యమిచ్చారు.

TDP-Janasena: హమ్మయ్యా.. అలక తీరింది.. అక్కడ టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి..

తిరుపతి: హమ్మయ్యా.. అలక తీరింది.. వివాదం సమసిపోయింది. ఇన్ని రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు నేడు ఏకమయ్యారు. తిరుపతి టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మతో ఆమె నివాసంలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు భేటీ అయ్యారు. దీంతో వివాదం సమసినట్టైంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దిశా నిర్దేశంతో భేటీకి ప్రాధాన్యమిచ్చారు. చంద్రబాబు ఆశయ సాధన కోసం ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం మహా కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామని సుగుణమ్మ తెలిపారు.

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

అవినీతి అక్రమాలతో కూడిన వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి పాలనను గాడిలో పెట్టడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పడిందని ఆరని శ్రీనివాసులు తెలిపారు. వైసీపీని బంగాళాఖాతంలో తోయడమే మూడు పార్టీల లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రిని చేయటం తథ్యమని ఆరని శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అభినయ రెడ్డి చేసిన అక్రమాలను కక్కిస్తామన్నారు. తిరుపతిలో భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో 50 డివిజన్లలోని టీడీపీ, జనసేన నేతలందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. తిరుపతిలోని టీడీపీ నేతలతో పాటు, తిరుపతి టీడీపీ ఇన్చార్జి సుగుణమ్మ ఆశీస్సులు సూచనలు సలహాలు తీసుకొని నడుచుకుంటామని ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి ప్రజలను గెలిపించటానికి సుగుణమ్మ జనసేనకు మద్దతుగా నిలబడుతున్నందుకు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

Pattabhi: వాలంటీర్లు తప్ప ప్రభుత్వానికి ఇంకా ఎవరూ లేరా?

మరిన్ని ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2024 | 12:40 PM