Share News

Pattabhi: వాలంటీర్లు తప్ప ప్రభుత్వానికి ఇంకా ఎవరూ లేరా?

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:48 AM

Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేందుకు పది రోజులు పడుతుందంటూ సర్కార్ చెప్పడంపై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే జగన్మోహన రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్‌లు ఎక్కడా డోర్ టూ డోర్ పెన్షన్‌లు డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పలేదన్నారు.

Pattabhi: వాలంటీర్లు తప్ప ప్రభుత్వానికి ఇంకా ఎవరూ లేరా?

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేందుకు పది రోజులు పడుతుందంటూ సర్కార్ చెప్పడంపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రాం (TDP Leader Kommareddy Pattabhi Ram) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే జగన్మోహన రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు (AP HighCourt), ఎలక్షన్ కమిషన్‌లు (Election Commission) ఎక్కడా డోర్ టూ డోర్ పెన్షన్‌లు డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పలేదన్నారు.

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చాక పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్న వారిని విధుల్లో నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని వాలంటీర్లను పథకాల పంపిణీకి వినియోగించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. అయితే దీనికి టీడీపీ కుట్ర చేసిందని చెప్పడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. మార్చి 29, 30, 31 తారీఖుల్లోనే కొన్ని వేల కోట్లు తమవారు అనుకునే కాంట్రాక్టర్‌లకు కట్టబెట్టేశారని ఆరోపించారు. ఇప్పడు ఖజానాలో చిల్లిగవ్వ లేదని... మొత్తం కాంట్రాక్టర్‌లకు దోచి పెట్టేశారన్నారు.

అప్పు పుడితే తప్ప పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి...

60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వలాంటే రూ.1958 కోట్లు అవసరమన్నారు. నాలుగు రోజులకు ముందు 3వ తేదీ నుంచి ఫించన్లు పంపిణీ అని జగన్ (CM Jagan) తన సోంత పత్రికలో వార్త రాయించారన్నారు. చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సీఈవో, సీఎస్‌లకు పెన్షన్ పంపిణీకి విఘాతం కలుగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వాలన్నారని చెప్పారు. వాలంటీర్లను పక్కనపెడితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంకా ఎవ్వరూ లేరా అని... సచివాలయ ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు లక్ష 35 వేల మంది ఉన్నారని.. రాష్ట్ర వ్యప్తంగా 15000 సచివాలయాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయం కింద 10 నుంచి 15 మంది పనిచేస్తున్నారన్నారు.

ఒక్కొక్క సచివాలయ ఉద్యోగులు ఇవ్వాల్సిన పెన్షన్‌లు 40 నుంచి 45 మాత్రమే అని అన్నారు. రోజుకు 15 మందికి ఇస్తే మూడు రోజుల్లో పెన్షన్‌లు ఇచ్చేయొచ్చని చెప్పారు. సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి సచివాలయ కార్యాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని నిలదీశారు. ఈరోజు ఖజానా మొత్తం తమ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఆ నెపాన్ని కూటమిపైన నెట్టారని విరుచుకుపడ్డారు. ఈ వాస్తవాన్ని ఫించను దారులు అర్ధం చేసుకోవాలన్నారు. మంగళవారం ఆర్బీఐ ఆక్షన్‌లో రూ.4000 కోట్లు అప్పు ఇస్తే తప్ప పెన్షన్‌లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పు పుడితే తప్ప పెన్షన్లు ఇవ్వలేని దుస్ధితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజార్చారని దుయ్యబట్టారు.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు బ్రేక్.. ఈసారి ఎంత తగ్గిందంటే


జగన్‌కు ఛాలెంజ్..

‘‘జగన్‌కు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మీ ముఖ్యమంత్రి సీటు నుండి ఒక్కరోజు తప్పుకో. చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఒక్కరోజులో పెన్షన్ దారులందరికీ పెన్షన్ పంపిణీ ఇంటింటికి చేసి చూపిస్తాం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ ఇంకో సర్కులర్ ఇచ్చారు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్‌లు ప్రభుత్వ పథకాలు ప్రచారం ఇంటింటికి వెళ్లి చేసి కాలేజీలలో విద్యార్ధుల రేషియో పెంచాలన్నారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకుతిన్నందునే నీపై ప్రజలు చెప్పులు విసురుతున్నారు. ఇదే విధంగా పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే వారు కూడా నీ మీద చెప్పులు విసురుతారు. సజ్జల రామకృష్ణా రెడ్డిని అడుగుతున్నా ఇంటింటికి వెళ్లి పెన్షన్‌లు పంపిణీ చెయ్యోద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న కుట్ర ఇది. వాలంటీర్ వ్యవస్ధను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చారు గనుకే ఎన్నికల కమిషన్ వారిని పక్కనపెట్టింది. వైసీపీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు అనడం వల్లే వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది’’ అని పట్టాభి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!

TS Congress: కాకరేపుతున్న ఆ నాలుగు స్థానాలు.. తెరపైకి కొత్త వ్యక్తి


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2024 | 11:52 AM