Share News

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు బ్రేక్.. ఈసారి ఎంత తగ్గిందంటే

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:10 AM

నేడు గ్యాస్ సిలిండర్(gas cylinder) ధరల్లో ఉపశమనం లభించింది. ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలను(prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 3 నెలలుగా పెరిగిన ధరల ట్రెండ్ కు ఈరోజు బ్రేక్ పడింది. ఏప్రిల్ 1, 2024న 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్(Commercial cylinder) ధర సిలిండర్‌పై రూ.30.50 తగ్గింది.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు బ్రేక్.. ఈసారి ఎంత తగ్గిందంటే

నేడు గ్యాస్ సిలిండర్(gas cylinder) ధరల్లో ఉపశమనం లభించింది. ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలను(prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 3 నెలలుగా పెరిగిన ధరల ట్రెండ్ కు ఈరోజు బ్రేక్ పడింది. ఏప్రిల్ 1, 2024న 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్(Commercial cylinder) ధర సిలిండర్‌పై రూ.30.50 తగ్గింది. అంతకుముందు మార్చిలో సిలిండర్‌పై రూ.25.50 చొప్పున ధరలు పెరిగాయి. అదే సమయంలో ఫిబ్రవరిలో రూ.14, జనవరిలో రూ.1.50 పెరిగింది. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

-దీంతో హైదరాబాద్‌లో 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.32.50 తగ్గింది

-ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.30.50 తగ్గింది

-కోల్‌కతాలో 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలు రూ.32 తగ్గాయి

-ముంబయిలో 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలు రూ.31.50 తగ్గాయి

-చెన్నైలో 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలు రూ.30.50 తగ్గాయి

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Loans: పర్సనల్ లోన్స్ కట్టకుంటే ఏమవుతుంది.. ఏం చర్యలు తీసుకుంటారు?


ఇక IOCL ప్రకారం ఢిల్లీలో 19 కిలోల LPG సిలిండర్ ధర నేటి నుంచి 1764.50 రూపాయలుగా మారింది. హైదరాబాద్‌లో 19 కిలోల LPG సిలిండర్ ధర నేటి నుంచి 1994.50కు చేరుకుంది. ఇది కాకుండా కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ.1879గా మారింది. అదే సమయంలో ఇంతకుముందు ఈ సిలిండర్ 1911 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 1717.50గా మారింది, అంతకుముందు దీని ధర రూ.1749. వాణిజ్య LPG సిలిండర్ ఇప్పుడు చెన్నైలో రూ. 1930.00కి అందుబాటులో ఉంటుంది.

మరోవైపు గృహ LPG సిలిండర్ గురించి మాట్లాడితే 14.2 KG గృహ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీలో దీని ధర రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50కి, హైదరాబాద్‌లో రూ.855గా అందుబాటులో ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank holidays in April 2024: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. పనిచేసేది కేవలం..

Updated Date - Apr 01 , 2024 | 11:15 AM