Share News

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:11 AM

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ (CM Jagan) అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. రెండు పిటిషన్లపై రిప్లైకి సీఎం జగన్ మరింత సమయం కోరారు. తదుపరి విచారణ ఆగస్ట్ 5 కి వాయిదా వేసింది.

AP Politics: నెల్లూరును క్లీన్ స్వీప్ చేసేందుకు ఆనం, సోమిరెడ్డి ఎత్తుగడలు..

జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆదేశించింది. ట్రయల్‌ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అన్న కారణంగా ట్రయల్‌ జాప్యం కావద్దని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. ట్రయల్‌ వేగంగా జరపాలని ఆదేశించారు. బెయిల్‌ రద్దు, హైదరాబాద్‌ నుంచి ట్రయల్‌ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభం అయ్యే వారానికి వాయిదా వేసింది.

Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 01:10 PM