Road Accident in AP: నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:19 AM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సైడ్ ఐరన్ భారీ గేట్లను ఢీ కొట్టింది. ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి ఐరన్ భారీ గేట్లను కొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులను ప్రత్యాన్మాయ వాహనాల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు.
అటు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో శుక్రవారం శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉలిందకొండ సమీపంలోకి రాగానే ట్రావెల్ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైక్ ను బస్సు దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బస్సు కింద బైక్ ఉండిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. బైక్ పైనున్న వ్యక్తి స్పాట్‌లో మరణించాడు. ఘటన తెల్లవారుజామున జరగడంతో ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Kurnool Fire Accident: కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
Minister Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి చర్యలు