Share News

Shreyas Iyer: టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం!

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:59 PM

తొడ కండరాల గాయంతో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.

Shreyas Iyer: టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం!

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే తొడ కండరాల గాయంతో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.


34వ ఓవర్‌లో హర్షిత్ రాణా (Harshit Rana) వేసిన బంతిని అలెక్స్ కేరీ(Alex Carey) గాల్లోకి ఆడాడు. శ్రేయస్ వెనక్కి పరుగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో కిందపడటంతో అతడి ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడి ఎడమ పక్కటెముకలకు తీవ్ర గాయమైనట్లు అనిపించింది. నొప్పితో విలవిల్లాడుతూ శ్రేయస్(Shreys Ayyar) మైదానాన్ని వీడాడు. దీంతో అయ్యర్ బ్యాటింగ్‌కి దిగుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది. శ్రేయస్ బ్యాటింగ్‌కు దిగకపోతే టీమిండియా(Team India) 9 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది.


మరోవైపు ఆసీస్ 236 పరుగులకు ఆలౌటైంది. 124-2తో పటిష్ట స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. హర్షిత్ రాణా 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 237 పరుగులు. మరి టీమిండియా వైట్ వాష్ నుంచి తప్పించుకుంటుందా? లేదా? చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

Virat Kohli Emotional: అడిలైడ్‌ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ

Updated Date - Oct 25 , 2025 | 02:41 PM