IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:13 PM
అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) భారత్ తో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 265 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మాథ్యూ షార్ట్(74), కూపర్ కోనోలీ(61*), మిచెల్ ఓవెన్(36) లు ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు
క్రికెట్ న్యూస్: అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) భారత్(India)తో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 265 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మాథ్యూ షార్ట్(74), కూపర్ కోనోలీ(61*), మిచెల్ ఓవెన్(36) లు ఆసీస్(Australia) గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) అర్ధ శతకాలు చేయగా.. అక్షర్ పటేల్ (44) రాణించాడు. శుభ్‌మన్ గిల్ (9), కేఎల్ రాహుల్ (11) విఫలం కాగా.. విరాట్ కోహ్లీ(Virat Kohil) వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ రెడ్డి (8) రాణించలేకపోయారు. గిల్, కోహ్లీ ఒకే ఓవర్లో ఔటవడంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్, శ్రేయస్ మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం (136 బంతుల్లో) నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో టెయిలెండర్లు హర్షిత్ రాణా (24*), అర్ష్‌దీప్ సింగ్ (13) మెరవడంతో భారత్ 264 పరుగులు చేసింది. ఇక మూడు వన్డేల సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్(India Loses Series)కోల్పోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇక చివరి మ్యాచ్ అక్టోబర్ 25(శనివారం) జరగనుంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..