Home » IND vs AUS
ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించిన, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(163) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అభిషేక్ ధన్యవాదాలు తెలిపాడు. వారి సహకారంతోనే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని చెప్పాడు.
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ కు తిలక్ వర్మను భారత్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఎంపిక చేయలేదు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించారు. అలాగే ఈ మ్యాచ్ లో టాస్ ఓడటంపై కూడా భారత్ కెప్టెన్ స్పందించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్ 167 పరుగులు చేసింది. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ శివం దూబే కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది.
క్వీన్స్‌ల్యాండ్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది.
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో T20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్ రాణా (4/39)తో రాణించడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ వికెట్లు దక్కించుకోవడం విశేషం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది.