IND vs AUS: రాణించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ 237..
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:45 PM
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్ రాణా (4/39)తో రాణించడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ వికెట్లు దక్కించుకోవడం విశేషం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్ రాణా (4/39)తో రాణించడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ వికెట్లు దక్కించుకోవడం విశేషం. వీరి ధాటికి ఆస్ట్రేలియా 236 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ముందు 237 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది (Ind vs Aus live score).
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభమే లభించింది. తొలి వికెట్‌కు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) 61 పరుగులు జోడించి భారత బౌలర్లను బెంబేలెత్తించారు. తర్వాత వచ్చిన మాట్ షార్ట్ (30) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మాట్ రెన్ షా (56) హాఫ్ సెంచరీ చేశాడు. ఒక దశలో 183/4తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆస్ట్రేలియా సులభంగా 280 పరుగులు చేస్తుందనిపించింది. అయితే మరో 50 పరుగులు మాత్రమే చేసి 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది (TeamIndia Target).
హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆసీస్ ఆశలపై నీళ్లు జల్లాడు (IND vs AUS 3rd ODI). వాషింగ్టన్ సుందర్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది. మరి, టీమిండియా బ్యాటర్లు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
India Pakistan War: భారత్‌తో యుద్ధం పాక్‌కే నష్టం.. మాజీ సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trump Canada trade talks: ఆ యాడ్‌పై ట్రంప్ ఫైర్.. కెనడాతో ట్రేడ్ టాక్ నిలిపివేత..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..