Share News

Trump Canada trade talks: ఆ యాడ్‌పై ట్రంప్ ఫైర్.. కెనడాతో ట్రేడ్ టాక్ నిలిపివేత..

ABN , Publish Date - Oct 25 , 2025 | 08:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక టీవీ యాడ్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఏకంగా కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిపివేతకే కారణమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కేంద్రంగా రూపొందించిన ఓ యాడ్ కెనడాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది.

Trump Canada trade talks: ఆ యాడ్‌పై ట్రంప్ ఫైర్.. కెనడాతో ట్రేడ్ టాక్ నిలిపివేత..
Trump Canada trade talks

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక టీవీ యాడ్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఏకంగా కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిపివేతకే కారణమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కేంద్రంగా రూపొందించిన ఓ యాడ్ కెనడాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఫలితంగా కెనడాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కెనడా చాలా మోసపూరితంగా వ్యవహరించిందని తీవ్ర విమర్శలు చేశారు (Reagan ad controversy).


కెనడాపై ట్రంప్ ఇటీవలి కాలంలో 35 శాతం సుంకాలు విధించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఓ ప్రకటనను రూపొందించింది. పన్నులకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను ఆ యాడ్‌లో పొందుపరిచారు. ఇతర దేశాలపై విధించే సుంకాలు, ఆంక్షలు దీర్ఘ కాలంలో అమెరికాకే చేటు చేస్తాయని అందులో రీగన్ పేర్కొన్నారు ( US Canada relations).


రీగన్ ఆడియో క్లిప్పులు ఉన్న ఆ యాడ్‌ గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది. దీంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు (Trump foreign policy). సుంకాలపై త్వరలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఆ తీర్పును ప్రభావితం చేసేందుకే కెనడా ఈ తరహా మోసపూరిత ప్రచారానికి తెర తీసిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా, ఆ యాడ్ వివాదాస్పదంగా మారడంతో ఒంటారియో గవర్నర్ ఆ యాడ్ ప్రసారాన్ని నిలిపివేయించారు. రోనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా ఆ యాడ్‌ ప్రసారాన్ని ఖండించింది.


ఇవి కూడా చదవండి:

అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు

కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 25 , 2025 | 08:00 AM