Share News

Afghan-Pak War: అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:18 PM

అప్ఘానిస్థాన్‌తో సరిహద్దును మూసియవేడంతో పాక్‌లో కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. టమాటాల ధర ఏకంగా 400 శాతం మేర పెరిగి 600 పాకిస్థానీ రూపయ్యాలకు చేరుకుంది.

Afghan-Pak War: అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు
Pakistan tomato price rise

ఇంటర్నెట్ డెస్క్: అప్ఘాన్-పాక్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య సరిహద్దు మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా పాక్‌లో కూరగాయలు, పండ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇరు దేశాల మధ్య దాదాపు 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అక్టోబర్ 11న ఘర్షణలు మొదలైన నాటి నుంచీ సరిహద్దులను మూసేశారు.

సరిహద్దు మూసేయడంతో అప్ఘాన్, పాకిస్థాన్‌లు రోజుకు 1 మిలియన్ డాలర్ల మేర నష్టపోతున్నాయని పాక్-అప్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్ ఖాన్ జాన్ అలకొజెయ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఏటా 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్య జరుగుతోంది. తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, డెయిరీ ఉత్పత్తుల వాణిజ్యం అత్యధికం.


ఈ నేపథ్యంలో పాక్‌లో టమాటాల ధరలు ఏకంగా 400 శాతం మేర పెరిగి కిలోకు రూ.600లకు చేరుకున్నాయి. యాపిల్స్ ధరలు కూడా పెరిగాయి. పాక్‌‌లో టమాటాల వినియోగం ఎక్కువ. అధిక శాతం టమాటాలు అప్ఘానిస్థాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. సరిహద్దుకు ఇరువైపులా వివిధ రకాల కూరగాయలతో దాదాపు 5000 ట్రక్కులు నిలిచిపోయాయని అలకొజెయ్ తెలిపారు. రోజుకు 500 ట్రక్కులతో కూరగాయలను ఎగుమతి చేస్తుంటామని, ఇవన్నీ పాడయిపోయాయని అన్నారు. ఈ పరిణామాలపై పాక్ వాణిజ్య శాఖ ఇప్పటివరకూ స్పందించలేదు.

ఇదిలా ఉంటే, పాక్, అప్ఘాన్ మధ్య గతవారం ఖతర్ వేదికగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సరిహద్దులు మూసివేసినా ఇరు వైపుల నుంచి ఎలాంటి దాడులు ఇప్పటివరకూ జరగలేదు. ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో సమావేశం కానున్నారు.


ఇవి కూడా చదవండి:

రష్యాపై ఆంక్షలతో చమురు ధరలకు రెక్కలు

కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 04:40 PM