India Pakistan War: భారత్‌తో యుద్ధం పాక్‌కే నష్టం.. మాజీ సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:56 AM
భారతదేశాన్ని అనవసరంగా రెచ్చగొడితే పాకిస్థాన్‌కే ప్రమాదమని, భారత్‌తో జరిగే ఎలాంటి యుద్ధంలోనైనా పాక్ ఓడిపోతుందని సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియకౌ అభిప్రాయపడ్డారు. కిరియకౌ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు.
భారతదేశాన్ని అనవసరంగా రెచ్చగొడితే పాకిస్థాన్‌కే ప్రమాదమని, భారత్‌తో జరిగే ఎలాంటి యుద్ధంలోనైనా పాక్ ఓడిపోతుందని సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియకౌ అభిప్రాయపడ్డారు. కిరియకౌ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. పాకిస్థాన్‌లో అమెరికా కౌంటర్ టెర్రరిజమ్ విభాగాన్ని నడిపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Ex-CIA officer India Pakistan).
'2001లో భారత్ పార్లమెంట్‌పై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. అణ్వాయుధాలు కలిగిన ఆ రెండు దేశాలు యుద్ధానికి దిగుతాయని భావించాం. కానీ, అదృష్టవశాత్తూ అలా జరగలేదు. భారత్‌తో జరిగే ఏ సాంప్రదాయక యుద్ధంలోనూ పాకిస్థాన్ గెలవలేదు. నేను అణ్వాయుధాల గురించి మాట్లాడడం లేదు. కానీ, భారతీయులను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల పాక్‌కు ఎలాంటి ఉపయోగమూ ఉండదు' అని కిరయకౌ వ్యాఖ్యానించారు (CIA Pakistan operations).
భారతదేశంతో యుద్ధం వల్ల తమకు ఎటువంటి ప్రయోజమూ ఉండదని ఇస్లామాబాద్ ఒక విధానపరమైన నిర్ణయానికి రావాలని కిరయకౌ సూచించారు (India Pakistan relations). అలాగే పాకిస్థాన్ ఆణ్వాయుధాలను అమెరికా నియంత్రిస్తుందని తనకు అనధికారికంగా తెలుసని ఆయన పేర్కొన్నారు. పాక్ కోసం అణ్వాయుధం రూపొందించిన అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను అమెరికా అంతం చేయగలిగి ఉండేదని, కానీ, సౌదీ అరేబియా కోరిక మేరకు అతణ్ని విడిచిపెట్టిందని కిరియాకౌ అన్నారు.
ఇవి కూడా చదవండి:
అప్ఘానిస్థాన్‌తో ఘర్షణలు.. పాక్‌లో 400 శాతం మేర పెరిగిన టమాటా ధరలు
కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి