Share News

Ban on Powerbanks in Flights: విమానాల్లో పవర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:34 PM

ఇటీవల ఇండిగో విమానంలో పవర్‌బ్యాంక్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో డీజీసీఏ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన భద్రతా నిబంధనలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పవర్ బ్యాంకు వినియోగంపై దృష్టి సారించడం లేదా పూర్తిస్థాయిలో నిషేధం విధించే యోచనలో డీజీసీఏ ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Ban on Powerbanks in Flights: విమానాల్లో పవర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ
DGCA powerbank ban

ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో పవర్‌బ్యాంకులను అనుమతించడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవర్‌బ్యాంకులను నిషేధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత వారం ఇండిగో విమానంలో పవర్‌బ్యాంక్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో డీజీసీఏ ఈ అంశపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది (DGCA Powerbank Use on Airlines).

ఢిల్లీ విమానాశ్రయంలో గత వారం ఇండిగో విమానంలో పవర్‌బ్యాంకు కారణంగా మంటలు చెలరేగాయి. ఆదివారం విమానం రన్‌వైకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు.


ఘటన అనంతరం, డీజీసీఏ సమగ్ర భద్రతా సమీక్షను ప్రారంభించింది. వపర్‌బ్యాంక్‌ల హ్యాండ్లింగ్ విషయంలో ప్రయాణికులు, విమానయాన సంస్థలు అనుసరిస్తున్న విధివిధానాల పరిశీలన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో విమానాల్లో పవర్‌బ్యాంక్‌ల వినియోగంపై నిషేధం, పవర్‌బ్యాంక్‌ల సామర్థ్యంపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ చర్యలతో ముప్పు ఆశించిన మేర తగ్గదనుకుంటే వీటిపై పూర్తిస్థాయి నిషేధం విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై పౌరవిమానయాన శాఖ కూడా దృష్టి సారించింది. ఏయే భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై డీజీసీఏతో కలిసి కసరత్తు చేస్తోంది.


ఇక అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని ఇండిగో సంస్థ కూడా ధ్రువీకరించింది. ఓ ప్యాసెంజర్ తన సీటుకు వెనుక వైపు ఉన్న పాకెట్‌లో పెట్టిన ఉపకరణంలో మంటలు చెలరేగాయని తెలిపింది. క్షణాల్లో సిబ్బంది మంటలను అదుపు చేశారని కూడా చెప్పింది. దీని వల్ల విమానానికి ఎటువంటి నష్టం కలగలేదని చెప్పింది. తనఖీల అనంతరం విమానం యథావిధిగా గమ్యస్థానానికి చేరుకుందని చెప్పింది. అంతకుముందు, ఓ ఎమిరేట్స్ విమానంలో కూడా ఇదే తరహా ప్రమాదం జరగడంతో విమానంలో వీటిని వినియోగించొద్దంటూ ఆ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర అంతర్జాతీయ విమానాల్లో కూడా ఇదే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు

వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 23 , 2025 | 06:18 PM