Home » DGCA
ఇటీవల ఇండిగో విమానంలో పవర్‌బ్యాంక్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో డీజీసీఏ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన భద్రతా నిబంధనలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పవర్ బ్యాంకు వినియోగంపై దృష్టి సారించడం లేదా పూర్తిస్థాయిలో నిషేధం విధించే యోచనలో డీజీసీఏ ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దసరా పూర్తైంది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ పండుగల సీజన్ వచ్చేస్తుంది. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.
పండుగ సీజన్‌లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా అదనపు ఫ్లైట్ సర్వీసులను నిర్వహించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. టిక్కెట్ ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.
డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు చైనాతో అంగీకారం కుదిరినట్టు భారత విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఈ నెలాఖరు నుంచీ ఇరు దేశాల మధ్య ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..
భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీజీసీఏ తాజాగా ఆదేశించింది. జులై 21లోపు ఈ తనిఖీలు పూర్తి చేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను కోరింది.
జూన్ 14 వియన్నాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దిగిపోవడం కలకలం రేపింది. పైలట్‌లు పరిస్థితిని వెంటనే చక్కదిద్దడంతో గమ్యస్థానానికి యథాప్రకారం చేరుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
Air India plane crash: జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యల కింది విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఎయిర్ పోర్టు పరిసరాల్లోని నిర్మాణాలపై కేంద్రం దృష్టి సారించింది. నిబంధనలను అతిక్రమించిన భవనాల ఎత్తు తగ్గించడం లేదా కూల్చి వేసేందుకు వీలుగా ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై ప్రజల సూచనలు, సలహాలను కోరింది.
Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..