Share News

DGCA Steps: ఇండిగో ఫ్లైట్‌ సర్వీసుల రద్దు.. రంగంలోకి దిగిన డీజీసీఏ..

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:31 PM

పైలట్ల కొరతతో ఇండిగో సంస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగోను ఆదుకోవటానికి ముందుకు వచ్చింది.

DGCA Steps: ఇండిగో ఫ్లైట్‌ సర్వీసుల రద్దు.. రంగంలోకి దిగిన డీజీసీఏ..
DGCA Steps

పైలెట్ల కొరత కారణంగా భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్‌ సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. గురువారం ఒక్క రోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 500 పైచిలుకు ఫ్లైట్‌లు రద్దయ్యాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి కొచ్చికి వెళ్లడానికి 40 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.


డీజీసీఏ తమ ఇన్‌స్పెక్టర్‌లను ఇండిగో ఫ్లైట్లు నడపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా డీజీసీఏ పెద్ద ఎత్తున పైలట్లను కాంట్రాక్ట్ మీద ఆడిటర్స్‌గా విధుల్లోకి తీసుకుంటూ ఉంటుంది. ఐదేళ్ల పాటు ఆ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. కాంట్రాక్ట్ అమల్లో ఉన్నంత కాలం ఆ పైలట్లు ఏ ఎయిర్‌లైన్స్‌లోనూ పని చేయకూడదు. ఇండిగో సంస్థ పైలెట్ల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డీజీసీఏ తమ పైలెట్లను ఇండిగో విమానాలు నడపటానికి సిద్దం చేసింది. నిన్న ( గురువారం) రాత్రి డీజీసీఏ అధికారులతో ఇండిగో అధికారులు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన పైలట్లకు సంబంధించిన నిబంధనల్లో కూడా డీజీసీఏ మార్పులు చేసినట్లు సమాచారం.


కాగా, డీజీసీఏ అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలే భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీజీసీఏ 2024 జనవరి నెలలో ఈ నిబంధలను ప్రకటించినా ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదు. ఇండిగో సంస్థ అక్టోబర్ 26న వింటర్ షెడ్యూల్‌లో విమానాల సంఖ్యను పెంచింది. సరిగ్గా అదే సమయంలో కొత్త నియమాలు అమల్లోకి రావడంతో పైలెట్ల కొరత తీవ్రతరం అయింది. దానికి టెక్నికల్ సమస్యలు తోడవ్వటంతో భారీ సంఖ్యలో ఫ్లైట్ల రద్దుకు కారణం అయింది.


ఇవి కూడా చదవండి

ఏపీలో విద్యా వ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: లోకేశ్

రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం మంచిదేనా?

Updated Date - Dec 05 , 2025 | 04:40 PM