Share News

Minister Nara Lokesh: ఏపీలో విద్యా వ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: లోకేశ్

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:14 PM

పిల్లలు, తల్లిదండ్రుల త్యాగాలను మరవకూడదని సూచించారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ఎంతో గొప్పదని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తల్లికి చెప్పలేని ఏ పని కూడా చేయకూడదని సూచించారు.

Minister Nara Lokesh: ఏపీలో విద్యా వ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: లోకేశ్
Minister Nara Lokesh

పార్వతీపురం మన్యం జిల్లా, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నైతిక విలువలు అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సూచించారు. పిల్లలు అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే సీఎం చంద్రబాబును అడిగి విద్యాశాఖను తీసుకున్నానని ప్రస్తావించారు. తనకు పేరెంట్స్ మీటింగ్స్ అంటే చాలా భయమని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఇవాళ(శుక్రవారం) నిర్వహించారు. మన్యం జిల్లా బామినిలో పాల్గొని ప్రసంగించారు మంత్రి నారా లోకేశ్.


ఈ సందర్భంగా ఆంధ్రకేసరి విద్యార్థి దశను ప్రస్తావించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా రచయిత కారా మాస్టరు (కాళీపట్నం రామారావు) సేవలను కొనియాడారు. తాను చదువుకున్నప్పుడు ఎప్పుడూ తన తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్‌కు రాలేదని చెప్పుకొచ్చారు. పిల్లలు, తల్లిదండ్రుల త్యాగాలను మరవకూడదని సూచించారు. తల్లి ప్రేమ, తండ్రి త్యాగం ఎంతో గొప్పదని చెప్పుకొచ్చారు. తల్లికి చెప్పలేని ఏ పని కూడా చేయకూడదని సూచించారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు మంత్రి నారా లోకేశ్.


పాఠ్యపుస్తకాల్లోనూ.. కవర్ పేజీల్లో ఎక్కడ కూడా మహిళలు ఇంటి పని చేస్తున్న చిత్రాలు ప్రచురించకుండా తగ్గించామని చెప్పుకొచ్చారు. 906 పాఠశాలల్లో అనేక విద్యా సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత తీసుకువచ్చామని పేర్కొన్నారు. లీప్ యాప్ ద్వారా పిల్లల ప్రగతి, హాజరు, ఇతర విషయాలన్నీ తల్లిదండ్రులు తెలుసుకునే సదుపాయం కల్పించామని వివరించారు. 2029 నాటికి ఏపీలో విద్యావ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన

Read Latest AP News and National News

Updated Date - Dec 05 , 2025 | 04:26 PM