Kolkata Doctor Assaulted: పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:07 PM
పశ్చిమ బెంగాల్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హౌరా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేస్తామంటూ రోగి తరపు వారు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచార ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హౌరా జిల్లాలో ఓ మహిళా డాక్టర్‌పై పేషెంట్ తరపు వారు వేధింపులకు దిగారు. ఉలుబేరియాలోని శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ గవర్నమెంట్ మెడికల్ అండ్ హాస్పిటల్‌లో సోమవారం ఈ దారుణం జరిగింది. డాక్టర్‌పై అత్యాచారం చేస్తామంటూ నిందితులు బెదిరింపులకు దిగారు (Sarat Chandra Chattopadhyay Medical College incident).
మీడియా కథనాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం పేషెంట్ తరపు వారికి, బాధిత మహిళా డాక్టర్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారు డాక్టర్‌పై అత్యాచారానికి ఒడిగడతామంటూ బెదిరించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను షేఖ్ సామ్రాట్, షేక్ బాబూలాల్, షేఖ్ హసీబుల్‌గా గుర్తించారు. షేక్ బాబులాల్ హోమ్‌గార్డు అని, అతడు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు (Woman Doctor Threatened in West Bengal).
ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై రాజ్యసభ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య విమర్శలు గుప్పించారు. ఆర్‌జీ కార్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదని మండిపడ్డారు. ‘తృణమూల్ పాలనలో సమాజం కల్లోలంగా మారింది. జుగుప్సాకర మనస్తత్వమున్న హోంగార్డులు, సివిక్ వాలంటీర్లు అధికారి పార్టీ భాగస్వాములుగా ఉన్నారు. తమ ప్రభుత్వ పాలన సాగుతోందని అనుకుంటున్నారు. పోలీసులు, పరిపాలన యంత్రాంగం అంటే వారికి లక్ష్యం లేదు. ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. ఇది చాలా విచారకరమైన ఘటన’ అని ఎంపీ అన్నారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా మండిపడ్డారు. బెంగాల్‌లో మహిళలు ఎదుర్కొంటున్న అభద్రత భయానకంగా ఉందని అన్నారు. మమతా బెనర్జీ ప్రకటనలన్నీ డొల్ల అని తేలిపోయిందని కామెంట్ చేశారు. మమతా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఈ ఘటనకు బాధ్యులని అన్నారు. బాధితులు భయంలో కూరుకుపోయారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పాపాలు పరిమితికి మించిపోయాయని కామెంట్ చేశారు.
ప్రతిపక్షాల విమర్శలను తృణమూల్ పార్టీ ప్రతినిధి తోసిపుచ్చారు. మహిళా డాక్టర్‌పై వేధింపులు విచారకరమని అన్నారు. నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నందీగ్రామ్‌లో జరిగిన అత్యాచార ఉదంతంలో బీజేపీ పార్డీ వర్కర్ అరెస్టు అయినప్పుడు వారంతా ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి