TG Govt On Sub Registrars: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:52 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది.
హైదరాబాద్, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ (Registration Department)లో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా నియమించిన అధికారులు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించారు. జీపీవోలు, ఇంజినీర్లు, సర్వేయర్ల నియమకాలతో ఉపాధి అవకాశాలని తమ ప్రభుత్వం విస్తరించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని నియమించామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల కలలు కల్లలు అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News