Share News

KTR: జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం: కేటీఆర్

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:21 PM

తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు.

KTR: జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం: కేటీఆర్
KTR On Congrss Party

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 23: రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందామన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి అయ్యారని చెప్పారు. రూ.500 కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చిందని ఆరోపించారు. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ జరిగిందన్నారు.


రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. శంకరాహిల్స్ లో రేవంత్ ఏం చేస్తున్నారో, సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో అన్నీ తమకు తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడని ఆరోపించారు. ముమ్మాటికీ రాష్ట్రాన్ని దండు పాళ్యం ముఠానే నడుపుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దండు పాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.


తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండియపడ్డారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుందన్నారు. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి? అనిప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై ఉత్తమ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలన్నారు.


పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారని.. ఆ ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ది ఇల్లునా.. సెటిల్మెంట్ కు అడ్డానా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ మీటింగ్ లోనే మంత్రులు తిట్టుకుంటున్నారని చెప్పారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారని ఆరోపించారు.


ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు. చాలా సిన్సియర్ అధికారి అయిన ఐఏఎస్ రిజ్వీని బలిపశువును చేశారని చెప్పారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ కు వెళ్ళే పరిస్థితి తెచ్చారని అన్నారు.


ఇవి కూడా చదవండి:

Tension at DGP's office: డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల ఆందోళన, పలువురు అరెస్ట్

TGSRTC: పుట్టపర్తికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Updated Date - Oct 23 , 2025 | 04:46 PM