Tension at DGP's office: డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల ఆందోళన, పలువురు అరెస్ట్
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:50 AM
డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గో రక్షక్ దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న జరిగిన సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గో రక్షక్ దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న జరిగిన సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. దశలవారీగా వస్తున్న బీజేపీ సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కాసేపట్లో డీజీపీ ఆఫీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రామ్ చందర్ రావు చేరుకోనున్నారు. గోరక్షకు కాల్పుల అంశంపై డీజీపీకి మెమొరండం ఇవ్వనున్నారు. అటు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి, అసెంబ్లీ ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
ఇవి కూడా చదవండి:
Student unions attack PET teacher: పీఈటీ టీచర్‌పై విద్యార్థి సంఘాల దాడి
Hyderabad: చందమామను తాకాలి... మార్స్‌పైకి వెళ్లాలన్నది నా కల..