KCR On BRS Leaders Meeting: కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:42 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గులాబీ పార్టీ కీలక నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)తో గులాబీ పార్టీ కీలక నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఇవాళ(గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజ్ శ్రావణ్, రసమయి బాలకిషన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)పై బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ స్థానాన్ని తామే మళ్లీ గెలవాలని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది
ఈ వార్తలు కూడా చదవండి..
పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News