Pocharam Firing Case: పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:27 AM
గడిచిన 10 రోజుల్లో నాలుగు సార్లు ఇబ్రహీం తరలిస్తున్న గోవులను పట్టుకున్నాడు ప్రశాంత్. ఈ క్రమంలో ప్రశాంత్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇబ్రహీం పక్కా ప్లాన్ అతడిపై అటాక్ చేశాడు.
హైదరాబాద్, అక్టోబర్ 23: మేడ్చల్ జిల్లాలోని పోచారం కాల్పుల కేసులో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను కాప్స్ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నేటి (గురువారం) ఉదయం 11:30 గంటలకు నిందితుల్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించునున్నారు. ఇబ్రహీం అనే వ్యక్తి గోవులను పక్క రాష్ట్రాలకు తరలిస్తుండగా... ఈ విషయంపై గోరక్షన్ దళ్‌కు ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ సమాచారం ఇచ్చాడు.
గడిచిన 10 రోజుల్లో నాలుగు సార్లు ఇబ్రహీం తరలిస్తున్న గోవులను పట్టుకున్నాడు ప్రశాంత్. ఈ క్రమంలో ప్రశాంత్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇబ్రహీం పక్కా ప్లాన్ అతడిపై అటాక్ చేశాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా మాట్లాడుకుందామని ప్రశాంత్‌ను పిలిపించాడు ఇబ్రహీం. కానీ ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో ప్రశాంత్‌పై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.
ఆపరేషన్ సక్సెస్..
మరోవైపు తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను స్థానికులు సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో అతడికి వైద్యులు ఆపరేషన్ చేశారు. దాదాపు 6 గంటల పాటు ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకు తీశారు యశోదా వైద్యులు. డాక్టర్ ప్రసాదరావు, సతీష్ నేతృత్వంలో ఆపరేషన్ కొనసాగింది. ఆపరేషన్ అనంతరం ప్రశాంత్‌ను 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత ప్రశాంత్‌కు మరో సర్జరీ అవసరం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News And Telugu News