Jubilee Hills by-election: కాంగ్రెస్.. మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టింది
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:55 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్క మజ్లిస్ క్యాండిడేట్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టిందని, మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
- బీఆర్‌ఎస్ సానుభూతి ఓట్ల కోసం వస్తోంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్క మజ్లిస్ క్యాండిడేట్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టిందని, మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు(BJP state president N. Ramachandra Rao) ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు రాజకీయ చైతన్య వంతులు. తప్పకుండా బీజేపీ అభ్యర్థికి పట్టం కడుతారని ఆయన అన్నారు. బుధవారం కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఉప ఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ యాదగిరినగర్ నుంచి ఎన్నికల ప్రచారం, పాదయాత్రను బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డి(Lankan Deepak Reddy)తో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ స్టిక్కర్లను గోడలకు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు.

ఆ రెండు పార్టీలు తెలంగాణను ఏవిధంగా దోచుకున్నాయో గడపగడపకు వెళ్లి ప్రజలకు తెలియజెబుతామని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News