Home » Jubilee Hills By-Election
2025 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కొందరి వల్లే పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నవీన్‌యాదవ్‌పై బీఆర్‌ఎస్, నాటి ఎమ్మెల్యే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నిందలు మోపినా భరిస్తూ నిలబడ్డాడు. ఆ ఓర్పు నేటి విజయానికి దోహద పడింది.’ అంటూ యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన వజీర్ లచ్చుమమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయోత్సవతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం రాత్రి యూసుఫ్‌గూడలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమికి కారణాలు ఏంటి? రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి?