Firing In IT Corridor: ఐటీ కారిడార్‌లో కాల్పులు.. ఒకరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:51 AM
ఐటీ కారిడార్‌లో కాల్పుల కలకలం రేగింది. సోనూ అలియాస్ ప్రశాంత్ లక్ష్యంగా ఇబ్రహీం కాల్పుల జరిపాడు. దీంతో సోనూ తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కాల్పులు ఘటన కలకలం రేపింది. సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సోనూ పక్కటెముకుల్లోకి బుల్లెట్లు దూసుకు వెళ్లాయి. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఇబ్రహీం అక్కడి నుంచి పరారైయ్యాడు. కాల్పులు శబ్దంతో స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సోనూను నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీం గోవులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. ఈ సమాచారాన్ని గోరక్ష దళ్‌కు అందిస్తున్నాంటూ సోనూపై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడు. ఆ క్రమంలో గత నెలలో సైతం గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను తన కారులో సోనూ వెంబడించడంతో ఇబ్రహీం మరింత కోపం పెంచుకున్నాడు. అయితే రాంపల్లి నుంచి ఘట్‌కేసరి వైపు కారులో వెళ్తున్న సోనూను ఇబ్రహీం వెంబడంచారు. యానంపల్లి వద్ద సోనూ కారును ఇబ్రహీం అడ్డుకున్నాడు.
అనంతరం సోనూను పక్కనే ఉన్న వెంచర్‌లోకి ఇబ్రహీం తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. దీంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో సోనూపై ఇబ్రహీం రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో రక్తపు మడుగులో సోనూ కుప్పకూలిపోయాడు. దీంతో ఇబ్రహీం అక్కడి నుంచి పరారైయ్యాడు. అయితే పోలీసులు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కీలక నిర్ణయం..!
బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు
For More TG News And Telugu News