Share News

Tuni Incident: తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య

ABN , Publish Date - Oct 23 , 2025 | 09:26 AM

కాకినాడ జిల్లా తునిలో మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి నారాయణరావు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో మరో సంచలన విషయం చోటు చేసుకుంది.

Tuni  Incident: తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య

కాకినాడ, అక్టోబర్ 22: తుని అత్యాచార నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికి తీసినట్లు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించామన్నారు. నారాయణరావును బుధవారం అర్ధరాత్రి తుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తున్నామని.. అయితే బాత్‌రూమ్‌కు వెళ్లాలని అతను చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. తుని శివారు చెరువు పక్కన తమ వాహనాన్ని ఆపగా.. వాహనం దిగిన వెంటనే నారాయణరావు చెరువులోకి దూకాడని తెలిపారు. వెంటనే అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, గజ ఈతగాళ్ల సాయంతోనూ వెతికామని చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి కావడంతో అతడి మృతదేహం లభ్యం కాలేదని.. గురువారం ఉదయం నారాయణరావు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశామని పేర్కొన్నారు.


కాకినాడ జిల్లా తునిలో మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి నారాయణరావు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికకు తాను తాతనంటూ గురుకుల సిబ్బందికి చెప్పి బయటకు తీసుకెళ్లాడు కామాంధుడు. అనంతరం తొండంగి సమీపంలో సపోట తోటలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమీపంలోనే ఉన్న ఒక వ్యక్తి గమనించి.. నారాయణ రావు వ్యవహారాన్ని వీడియో తీశాడు. అలాగే నారాయణరావును నిలదీశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులతోపాటు స్థానికులు నారాయణరావుకు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్లు హతం

బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 04:38 PM