Share News

Encounter In Delhi: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్లు హతం

ABN , Publish Date - Oct 23 , 2025 | 09:03 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు.

Encounter In Delhi: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్లు హతం

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ సైతం ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు బిహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌‌‌లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు వీరంతా భారీ కుట్రకు ప్రణాళికలు సిద్ధం చేసిన్నట్లు వార్తలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ వీరంతా హతం కావడం గమనార్హం.


ఇక ఈ గ్యాంగ్‌స్టర్ల ముఠా కదలికపై న్యూఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ క్రమంలో ఈ ఎన్‌కౌంట్ చోటు చేసుకుంది. మరణించిన గ్యాంగ్‌స్టర్లు రంజన్ పాఠక్, బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఈ నలుగురిలో ముగ్గురు బిహార్‌లోని సీతామర్హికి చెందిన వారని కాగా. ఒకరు మాత్రం ఢిల్లీకి చెందిన వారు. ఈ నలుగురిపై బిహార్‌లోని అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్న వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీ పేరుతో ఈ ముఠా అరాచకాలు సృష్టిస్తోంది. ఈ ముఠాకు రంజన్ పాఠక్ నేతృత్వం వహిస్తున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య

బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు

For More National News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 09:53 AM