CM Chandrababu UAE Business Meetings: అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:15 AM
రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అబుదాబిలో పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు.
అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ అబుదాబీలో పర్యటించనున్నారు. అబుదాబీలోని పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. మొత్తం తొమ్మిది కీలక మీటింగ్‌లు, విజిట్‌లలో సీఎం చంద్రబాబు బృందం పాల్గొనుంది. ముఖ్యంగా పెట్టుబడులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీ, జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీ, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, టెక్నాలజీ సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
అదే విధంగా లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీ, అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్ మెరీ, మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహిలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రిటైల్, ఇంధనం, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులలో పెట్టుబడులపై చర్చ జరగనుంది.
అబుదాబీలోని యాస్ ఐల్యాండ్ పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఆలోచనలు పంచుకోనున్నారు. చివరిగా, భారత కౌన్సిల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు చంద్రబాబు హాజరుకానున్నారు.
Also Read:
కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న రేవంత్ సర్కార్..
ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు!
For More Latest News