Share News

Telangana Cabinet Meeting: కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న రేవంత్ సర్కార్..

ABN , Publish Date - Oct 23 , 2025 | 08:17 AM

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా,

Telangana Cabinet Meeting: కేబినెట్ భేటీ..  కీలక నిర్ణయాలు తీసుకోనున్న రేవంత్ సర్కార్..
Telangana Cabinet Meeting

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు.


స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది. అదే విధంగా, స్థానిక ఎన్నికల్లో అమల్లో ఉన్న 'ఇద్దరు పిల్లల నిబంధన' రద్దు చేయడానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.


అదనంగా, SLBC టన్నెల్‌ పనుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు, అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మాణం, మున్నేరు వాగు రిటైనింగ్ వాల్, పంచాయతీ రాజ్‌, ఆర్ అండ్ బీ శాఖలకు సంబంధించిన పలు అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.


అంతేకాక, SRSP స్టేజ్‌–2 ప్రాజెక్టుకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు ఖరారు చేసే ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం మీద నేటి కేబినెట్‌ సమావేశం తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్‌ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిప్పనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read:

బలహీనపడనున్న అల్పపీడనం.. భారీ వర్షాలు

ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు!

For More Latest News

Updated Date - Oct 23 , 2025 | 08:18 AM