Share News

Morning Health Habits: ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు!

ABN , Publish Date - Oct 23 , 2025 | 07:55 AM

ఉదయం నిద్ర లేవగానే ఈ మూడు పనులు చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం లేవగానే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Morning Health Habits: ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు!
Morning Health Habits

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ రోజంతా ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉండాలని కోరుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తి కావాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ వాస్తవానికి, చాలా మంది కొద్దిగా పని చేసిన తర్వాత వెంటనే అలసిపోతారు, మిగితా పనులు రేపు కంప్లీట్ చేద్దాంలే అని సోమరితనం చూపిస్తారు. అయితే, ఉదయం నిద్రలేచిన కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే, ఎలాంటి సోమరితనం లేకుండా చురుకుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం నిద్రలేచిన వెంటనే ఏమి చేయాలో తెలుసుకుందాం..


Drinking water.jpg

నీరు తాగండి : ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది.


యోగా చేయండి: ఉదయం లేచిన తర్వాత తేలికపాటి వ్యాయామం లేదా యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది.

Yoga (3).jpg

మీ రోజును సరిగ్గా ప్లాన్ చేసుకోండి: ఉదయం మీకోసం కొంత సమయం కేటాయించుకుని, ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులను నోట్ చేసుకోండి. మీరు ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. మీరు ఈ ప్రణాళిక ప్రకారం పని చేస్తే, ఆ రోజు మీ పనులన్నీ పూర్తి అవుతాయి.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

కొండా లక్ష్మారెడ్డికి వేమూరి రాధాకృష్ణ నివాళి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 07:55 AM