Vemuri Radhakrishna Pays Tribute: కొండా లక్ష్మారెడ్డికి వేమూరి రాధాకృష్ణ నివాళి
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:22 AM
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ ఎన్‌ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమం...
లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్(ఎన్‌ఎ్‌సఎ్‌స) వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమం లోయర్‌ట్యాంక్ బండ్‌లోని పింగళి వెంకటరామారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం జరిగింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై లక్ష్మారెడ్డికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. లక్ష్మారెడ్డి కుమారులు విజిత్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డిలను పరామర్శించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మర్రి రవీందర్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తదితరులు లక్ష్మారెడ్డికి నివాళులర్పించారు.