Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Oct 23 , 2025 | 03:56 PM
గురువారం ఆస్ట్రేలియాతో భారత్ అడిలైడ్ వేదికగా రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను జీరో పరుగులు చేసినా ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. అతడు డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
క్రికెట్ న్యూస్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ గెలవాలనే కసి అతడిలో ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో ఓటమి అంచుల్లో ఉన్న భారత్‌ను ఆదుకుని.. విజయ తీరాలకు చేర్చే వరకు క్రీజ్ వదల్లేదు. ఇక మైదానంలో కోహ్లీ చాలా అరుదుగా మాత్రమే భావోద్వేగానికి గురవుతుంటాడు. అయితే తాజాగా అడిలైడ్ మ్యాచ్‌లో ప్రేక్షకులు చేసిన పనికి కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
గురువారం ఆస్ట్రేలియా(Australia)తో భారత్ అడిలైడ్ వేదికగా రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(Virat Kohli) డకౌట్ అయ్యాడు. అతను జీరో పరుగులు చేసినా ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. అతడు డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దీంతో కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ(Virat Kohli).. అడిలైడ్ లో ప్రేక్షకులు ఘన వీడ్కోలు పలికారు. ఇదే సమయంలో కోహ్లీ తల వంచుకొని.. గ్లోవ్స్ తీసేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ మైదానం వీడాడు. ఈ సన్నివేశం కోహ్లీ అభిమానులను(Cricket Fans) తీవ్ర బాధకు గురి చేసింది.
అడిలైడ్ మైదానంలో(Adelaide ODI) ఒకప్పుడు రారాజుగా పరుగుల మోత మోగించిన కోహ్లీ.. ఇప్పుడు మౌనంగా నిష్క్రమించడం చూసి అతడి అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అడిలైడ్ గ్రౌండ్(Adelaide ODI)తో కోహ్లీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఒక్క మైదానంలోనే కోహ్లీ 5 శతకాలు బాదాడు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కింగ్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..